
కారు బైక్ ఢీ-ఇద్దరికి గాయాలు
వెల్దండ మండలంగుండాల గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మండల పరిధిలోని అంకమోనికుంటకు చెందిన ఒర్సు మహేశ్, చందు గాయపడ్డారు. 108 అంబులెన్సు ద్వారా వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మహేశ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు.


































