అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

641చూసినవారు
అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
చారకొండ మండల కేంద్రంలో మంగళవారం మండల స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొని, మండలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను సమీక్షించారు. సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకురాగా, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. ఈ సమీక్షలో అభివృద్ధి పనుల పురోగతిని, ఎదురవుతున్న సవాళ్లను చర్చించారు.

సంబంధిత పోస్ట్