అచ్చంపేట బిడ్డలకు తెగువ ఎక్కువ: కేటీఆర్

400చూసినవారు
అచ్చంపేట బిడ్డలకు తెగువ ఎక్కువ: కేటీఆర్
అచ్చంపేటలో జరిగిన జన గర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గ ప్రజలను ప్రశంసించారు. మంత్రులకు తెలివి లేకపోయినా, అచ్చంపేట బిడ్డలకు తెగువ ఉందని అన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాదని, తిరిగి కేసీఆర్ అధికారంలోకి వస్తారని తెలిపారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ, ఆయన మాటలు రాష్ట్ర పరువు తీసేలా ఉన్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడగడానికి వస్తే ప్రజలే బుద్ధి చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్