వరదలో కొట్టుకుపోయిన పంట.. గుండెలవిసేలా ఏడ్చిన రైతు (వీడియో)

7చూసినవారు
భారీ వర్షాలు ఓ రైతుకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని దేవరబండ గ్రామంలో రైతు మూడవత్ బిక్య నాయక్‌కు చెందిన 2.5 ఎకరాల వరి పంట మునిగిపోవడంతో పాటు, 20 క్వింటాళ్ల పత్తి, పైపులు, పాడి ఆవులు వరదలో కొట్టుకుపోవడంతో గుండెలవిసేలా రోదించాడు. సర్వం కోల్పోవడంతో రైతు ఏడ్చిన తీరు కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రభుత్వం బిక్య నాయక్‌ను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్