అచ్చంపేట పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం తర్వాత ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాదాపు గంటపాటు కురిసిన ఈ వర్షంతో పరిసరాలు చిత్తడిగా మారాయి. రోడ్లపై భారీ నీరు చేరడంతో పలుచోట్ల కాలనీలు జలమయమయ్యాయి. చాలా రోజుల తర్వాత వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. భారీ వర్షాలు పంటల సాగుకు ఉపయోగకరంగా ఉంటాయని వారు తెలిపారు.