వంగూరు మండలం జాజాల గ్రామంలో శనివారం బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. గ్రామ సర్పంచ్ జిలకర కాశమ్మ సైదులు నివాసానికి వెళ్లి, సర్పంచ్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మహిళా సర్పంచ్‌ను దారుణంగా అవమానించిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.