Jan 08, 2026, 01:01 IST/కల్వకుర్తి
కల్వకుర్తి
తర్నికల్ యువకుడు రామకృష్ణ గౌడ్ కు పీహెచ్డీ పట్టా
Jan 08, 2026, 01:01 IST
నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన ఎలుక రామకృష్ణ గౌడ్, హైదరాబాద్లోని CISR‑IICT (Organic Supramolecular Chemistry)లో పీహెచ్డీ పట్టా పొందారు. చిన్నప్పటి నుంచి అనేక కష్టాలను అధిగమించి తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయం సాధించారు. ఆయన తండ్రి ఎలుక వెంకటయ్య గౌడ్, తల్లి ఎలుక నిరంజనమ్మ, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పాఠశాల సిబ్బంది, స్నేహితులు రామకృష్ణ గౌడ్ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. పేదరికం నుండి వచ్చి ఉన్నత స్థాయికి చేరినందుకు గ్రామ ప్రజలు గర్విస్తున్నారు.