
మీ డబ్బు, ఫోన్ ఈ స్కామ్ నుంచి కాపాడుకోండిలా (వీడియో)
దేశంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా eSIM స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఇది ముఖ్యంగా మొబైల్ యూజర్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతోంది. ఈ స్కామ్‌లో మోసగాళ్లు బాధితుడికి కాల్ చేసి, eSIM యాక్టివేషన్ లింక్ పంపుతారు. ఆ లింక్‌పై క్లిక్ చేస్తే, ఫిజికల్ సిమ్ eSIMగా మారి అసలు నెట్వర్క్ పనిచేయకపోవడం వల్ల అన్ని కాల్స్, మెసేజ్‌లు మోసగాళ్లకు వెళ్తాయి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం.




