గోకారం ఆలయ కమిటీల్లో రాజకీయ దుమారం: బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య వివాదం

0చూసినవారు
గోకారం ఆలయ కమిటీల్లో రాజకీయ దుమారం: బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య వివాదం
చారకొండ మండలంలోని గోకారం గ్రామంలో సారగట్ల మైసమ్మ ఆలయ కమిటీల ఏర్పాటులో రాజకీయ జోక్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న తుర్కలపల్లిలో కాంగ్రెస్ వర్గం కమిటీ ఏర్పాటు చేయగా, శుక్రవారం గోకారం గ్రామంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు వేర్వేరు కమిటీలను ఎన్నుకున్నాయి. ఇది దేవాలయ కమిటీలా కాకుండా రాజకీయ పార్టీల కమిటీలా మారిందని, ప్రజాభిప్రాయంతో కాకుండా రాజకీయాలతో కమిటీలు ఏర్పాటు చేయడం దురదృష్టకరమని విమర్శకులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్