నాగర్‌కర్నూల్‌లో విషాదం.. పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

546చూసినవారు
నాగర్‌కర్నూల్‌లో విషాదం.. పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అన్నంలో పురుగుమందు కలిపి తిని తల్లి ప్రసన్న (40), కుమార్తె మేఘన (13) మృతి చెందారు. తల్లి, ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. వీరితో పాటు ఉన్న కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల కిందట ప్రసన్న భర్త గుండెపోటుతో మరణించినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్