
కల్వకుర్తి: 42 శాతం రిజర్వేషన్ కై బీసీల మౌనవ్రతం
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో బీసీ సబ్ ప్లాన్, రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మౌనవ్రతం చేపట్టారు. గురువారం సాయంత్రం తహశీల్దార్ కార్యాలయం నుంచి నోటికి నల్ల వస్త్రాలు కట్టుకుని, అంబేడ్కర్ చౌరస్తా వరకు మౌన ర్యాలీ నిర్వహించారు. బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ, 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాన్ని ఆపబోమని స్పష్టం చేశారు.

































