
నాగర్కర్నూల్: నీట్ లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం: మంత్రి జూపల్లి
నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వరుస లీకేజీలు జరుగుతున్నా సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని మంత్రి జూపల్లి ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత లోపించాయని, దీనివల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఏ (NTA)ను తక్షణమే ప్రక్షాళన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.




































