Nov 21, 2025, 15:11 IST/వనపర్తి
వనపర్తి
వనపర్తి: ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
Nov 21, 2025, 15:11 IST
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఫంక్షన్ హాల్లో శుక్రవారం జిల్లా స్థాయి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హాజరై, మహిళా సమైక్య సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనకాయపల్లి, దొడగుంటపల్లి, మనిగిళ్ళ, జగత్ పల్లి గ్రామాల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వంలో మహిళలకు అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.