May 16, 2026, 01:05 IST/
కోమాలో ఉన్న కానిస్టేబుల్‌కు 64 లక్షల పరిహారం
May 16, 2026, 01:05 IST
TG: విధి నిర్వహణలో ప్రమాదానికి గురై కోమా స్థితిలో ఉండి చికిత్స పొందుతున్న ఆక్టోపస్ కానిస్టేబుల్ జీ రజనీకాంత్ కుటుంబానికి ఎస్బీఐ పోలీస్ శాలరీ ప్యాకేజీ కింద రూ.64 లక్షల బీమా పరిహారం మంజూరైంది. హైదరాబాద్‌లోని ఆక్టోపస్ ప్రధాన కార్యాలయంలో ఆపరేషన్స్ డీజీ అనిల్‌కుమార్ చేతుల మీదుగా కానిస్టేబుల్ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు ఈ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, బీమా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.