ఊట్కూరు మండలంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు కడుపునొప్పితో బాధపడుతుండటంతో వైద్య పరీక్షలు చేయించగా, ఆమె 3 నెలల గర్భవతి అని తేలింది. అదే గ్రామానికి చెందిన యువకుడు మాయమాటలు చెప్పి ఆమెను లొంగదీసుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ ఘటనపై గ్రామస్తుల సమక్షంలో జరిగిన పంచాయతీలో బాలికకు రూ.2.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, అబార్షన్ చేయించుకోవాలని యువకుడికి సూచించినట్లు సమాచారం. ఈ విషయంపై కేజీబీవీ ఎస్ఓను వివరణ కోరగా, సెలవులకు వెళ్లిన విద్యార్థిని హాస్టల్ కు రాలేదని, అనారోగ్యంగా ఉందని కుటుంబ సభ్యులు ఫోన్ లో తెలిపారని ఆమె వివరించారు.