కొత్తకోట బీసీ బాలికల వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థినులు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, విధుల్లో నిర్లక్ష్యం వహించిన వార్డెన్ విజయతో పాటు వర్కర్లను సస్పెండ్ చేసింది. నిన్న BC రాష్ట్ర వెల్ఫెర్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్వేతా ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, DEO అబ్దుల్ ఘనీ, DMHO తదితరులు హాస్టల్‌ను సందర్శించి విచారణ చేపట్టారు.