
ఈ నెల 14 నుంచి బౌరాపూర్ జాతర
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని బౌరాపూర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామి జాతరకు ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మూడు రోజుల పాటు అనుమతి లభించింది. అటవీ శాఖ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. జాతర పూర్తిగా గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం జరుగుతుందని, భక్తులు అడవిలోకి ప్లాస్టిక్, మంట వస్తువులు తీసుకెళ్లవద్దని, అధిక శబ్దాలు చేస్తూ అటవీ జంతువులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు.






































