అచ్చంపేట: వర్షానికి జలమయమైన కాలనీ

1095చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ ఎస్సీ కమ్యూనిటీ హాల్ రోడ్డులో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. కాలనీవాసులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల ముందు వాగుల్లా నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమస్యను పరిష్కరించాలని, నిల్వ నీటిని తొలగించాలని మున్సిపల్ అధికారులను కాలనీవాసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్