నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పదర మండలం బావోజీ తండాలో అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్న అంజి అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ డీటీఐ, స్థానిక పోలీసులు జరిపిన దాడుల్లో నిందితుడు పట్టుబడగా, స్వాధీనం చేసుకున్న సారాను ధ్వంసం చేశారు. నిందితుడిని తహశీల్దార్ యూసుఫ్ అలీ ముందు హాజరుపరిచి, తిరిగి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా బైండోవర్ చేశారు.