అచ్చంపేట: 6th క్లాస్ విద్యార్థినికి RTC ఉద్యోగం.. రేషన్ కట్!

858చూసినవారు
అచ్చంపేట: 6th క్లాస్ విద్యార్థినికి RTC ఉద్యోగం.. రేషన్ కట్!
అధికారుల అత్యుత్సాహంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం ఘనపూర్ కు చెందిన బొడ్డుపల్లి మల్లేశ్, లిఖిత రేషన్ కోసం వెళ్లగా, వారి రేషన్ కార్డు రద్దయింది. ఇంట్లోని 6వ తరగతి చదువుతున్న విద్యార్థినికి RTC ఉద్యోగం ఉందని, అందుకే కార్డును తొలగించామని అధికారులు తెలిపారు. విద్యార్థినికి ఉద్యోగం ఎలా సాధ్యమని మల్లేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సాంకేతిక లోపం అని అధికారులు చెప్పడంతో, కార్డును వెంటనే పునరుద్ధరించాలని మల్లేశ్ కోరారు.

సంబంధిత పోస్ట్