నల్లమలలో ATR సఫారీ సేవలు తాత్కాలికంగా నిలిపివేత

608చూసినవారు
నల్లమలలో ATR సఫారీ సేవలు తాత్కాలికంగా నిలిపివేత
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమలలో ATR సఫారీ సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు, అంటే 90 రోజుల పాటు పర్యాటకులకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మన్ననూర్ రేంజి ఆఫీసర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటకులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్