మద్యం మత్తులో భిక్షాటన.. చిన్నారి దుస్థితిపై కంటతడి

571చూసినవారు
మద్యం మత్తులో భిక్షాటన.. చిన్నారి దుస్థితిపై కంటతడి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం హిమాలయ హోటల్ సమీపంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో పసికందుతో భిక్షాటన చేస్తున్నాడు. ఎముకలు కొరికే చలిలో చిన్నారి అవస్థలు చూసి బాటసారులు కంటతడి పెడుతున్నారు. చిన్నారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, బాలల సంరక్షణ అధికారులు (CWC) వెంటనే స్పందించి రక్షించాలని కోరుతున్నారు. ఈ హృదయవిదారక దృశ్యం స్థానికులను కలచివేస్తోంది.

సంబంధిత పోస్ట్