నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం భగత్ సింగ్ 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. తారా సింగ్, జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ, జిల్లా నాయకులు హైమద్, రాకేష్, భరత్, విజయ్, తరుణ్, రామకృష్ణ, సాయి తేజ, మణికంఠ, సందీప్ తదితరులు పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ దేశానికి చేసిన సేవలను, ఆయన ఆశయాలను స్మరించుకున్నారు.