స్కూల్‌ ఆవరణలో మృతదేహం కలకలం

1చూసినవారు
నాగర్‌కర్నూల్ జడ్పీహెచ్‌ఎస్‌ బాయ్స్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పాఠశాల వెనుక భాగంలో బుధవారం మృతదేహాన్ని గుర్తించిన కొందరు, వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. ఉపాధ్యాయులు పోలీసులకు తెలపడంతో, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి గుర్తింపునకు సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్