మహిళలను మోసం చేసిన ఘరానా మోసగాడు అరెస్టు

682చూసినవారు
మహిళలను మోసం చేసిన ఘరానా మోసగాడు అరెస్టు
మహిళలకు ద్విచక్ర వాహనంపై లిఫ్ట్ ఇస్తానని చెప్పి, మాయమాటలతో మోసం చేసి, నగలు దోచుకున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 19న నాగర్‌కర్నూల్ జిల్లా కుప్పగండ్లకు చెందిన వగ్గు సంతోష అనే మహిళను పరిచయం చేసుకుని, లిఫ్ట్ ఇస్తానని చెప్పి, బ్యాంకుల్లో రుణం ఇప్పిస్తానని నమ్మించి, ఆమె వద్ద ఉన్న రూ.31 వేల విలువైన స్వర్ణాభరణాలను దోచుకున్నాడు. సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితుడు ముకురాల రాజేందర్‌గౌడ్‌ను సోమవారం అరెస్టు చేశారు. అతనిపై నాగర్‌కర్నూల్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 10కి పైగా కేసులు నమోదైనట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్