సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది: మంత్రి

5చూసినవారు
సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది: మంత్రి
విధి నిర్వహణలో మరణించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో సౌమ్య భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, సౌమ్య కుటుంబానికి రూ. కోటి ఎక్స్ గ్రేషియా, తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం, సర్వీస్ కాలం వరకు వేతనం చెల్లిస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని, అధికారులకు ఆయుధాలు ఇచ్చే పరిశీలనలో ఉందని, మాదకద్రవ్యాల ముఠాలపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్