పదో తరగతి ఫలితాల్లో... నాగర్ కర్నూల్ 2, గద్వాల 29వ స్థానం

507చూసినవారు
పదో తరగతి ఫలితాల్లో... నాగర్ కర్నూల్ 2, గద్వాల 29వ స్థానం
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. నాగర్ కర్నూల్ జిల్లా 99.03% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో రెండో స్థానాన్ని సొంతం చేసుకోగా, నారాయణపేట 97.82%తో 14వ స్థానంలో నిలిచింది. వనపర్తి జిల్లా 97.46%తో 19వ స్థానం, మహబూబ్ నగర్ 94.57%తో 26వ స్థానం, జోగుళాంబ గద్వాల 93.93%తో 29వ స్థానంలో నిలిచాయి. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు అభినందించారు.

సంబంధిత పోస్ట్