నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం అదనపు కలెక్టర్ దేవ సహాయంతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్, పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, ఎక్కడా జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.