తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలో వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గంలోని డిండి ప్రాజెక్టులోకి గతంలో ఎన్నడూ లేనంతగా వరద నీరు వచ్చి చేరుతోంది, దీంతో ప్రాజెక్టు అలుగు పారుతోంది. అధిక నీటి ప్రవాహం వల్ల డిండి కింది భాగంలో ఉన్న మైనర్ బ్రిడ్జి కొంతమేర దెబ్బతింది. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.