మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తెలకపల్లి మండలం బొప్పల్లి గ్రామానికి చెందిన చిన్న వెంకటయ్య వడదెబ్బతో స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లారు. సర్పంచ్ నవ్య మల్లాచారి సమాచారం మేరకు లింగాల 108 సిబ్బంది వెంటనే స్పందించి, ఈఎంటీ లక్ష్మణ్, పైలట్ ఖాజా, డాక్టర్ మనీశ్ సూచనలతో సకాలంలో వైద్యం అందించి ప్రాణాపాయం తప్పించారు. అనంతరం బాధితుడిని మెరుగైన చికిత్స కోసం పీహెచ్సీకి తరలించారు.