కల్వకుర్తి: జేసీబీకి నిప్పంటించిన దుండగులు

764చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు పకీరయ్య గౌడ్ అనే వ్యక్తికి చెందిన జేసీబీకి నిప్పంటించారు. ఇంటి ముందు నిలిపి ఉంచిన జేసీబీకి దుండగులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టగా, యజమాని గమనించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్