తుఫాను ప్రభావంతో కల్వకుర్తి నియోజకవర్గం ఊర్కొండ మండలం జకినాలపల్లి, ఇప్పపహాడ్ తదితర గ్రామాలలో సోమవారం భారీ వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై, ఒక్కసారిగా వర్షం మొదలైందని స్థానికులు తెలిపారు. అధిక వర్షాలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ వర్షం మరింత నష్టాన్ని కలిగించింది.