కొల్లాపూర్: డీసీఎం బోల్తా.. 140 గొర్రెలు, వ్యక్తి మృతి

578చూసినవారు
డిండి మండలం ఎర్రగుంటపాలెం స్టేజీ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ నుంచి గొర్రెల లోడ్ తో వస్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన గొర్రెల పెంపకందారుడు చిట్టికొండ ఎల్లయ్య (50) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో వాహనంలో ఉన్న 140 గొర్రెలు కూడా నలిగిపోయి మరణించాయి. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్