కొల్లాపూర్: మెట్రో రైలులో ప్రయాణించిన మంత్రి జూపల్లి

437చూసినవారు
కొల్లాపూర్ ఎమ్మెల్యే, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం హైదరాబాద్ మెట్రో రైలులో సామాన్యుడిలా ప్రయాణించారు. ఎర్రమంజిల్ స్టేషన్ నుండి మియాపూర్ వరకు మెట్రోలో వెళ్లిన ఆయన, స్వయంగా క్యూలో నిలబడి టికెట్ కొనుగోలు చేశారు. రద్దీగా ఉన్నప్పటికీ, ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా నిలబడే ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో మాట్లాడి మెట్రో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ కష్టాలు లేకుండా త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రో ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి కొనియాడారు.

సంబంధిత పోస్ట్