కొల్లాపూర్ పట్టణంలోని ఆత్మ జ్ఞాని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వార్షికోత్సవానికి హాజరైన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సమాజంలో మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారని, అయితే మనం చేసే మంచి పనులే చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. సమాజంలో కీర్తి పొందాలంటే, గొప్పవారని అనిపించుకోవాలంటే చేసే పనులు సక్రమంగా, అందరికీ ఉపయోగపడేలా, జాతి శ్రేయస్సు కోరే విధంగా ఉండాలని ఆయన సూచించారు.