నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'కాంగ్రెస్ బాకీకార్డు' పేరుతో నిర్వహించనున్న ఈ బహిరంగ సభ కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ర్యాలీగా అచ్చంపేటకు బయల్దేరారు. ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించనుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపిస్తూ, వారి బాకీలను గుర్తుచేసేలా ఈ సభను నిర్వహిస్తున్నారు.