నాగర్ కర్నూల్: మద్దతు ధర కోసం పత్తి మిల్లు వద్ద రైతుల ధర్నా

685చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా రూరల్ మండలం గగ్గలపల్లి పత్తి మిల్లు వద్ద రైతులు గురువారం రాత్రి మెరుపు ధర్నా నిర్వహించారు. పత్తి కొనుగోలులో మద్దతు ధర చెల్లించడం లేదని నిరసిస్తూ మిల్లు ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేయడంతో, రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్