నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామ సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కేఎల్ఐ) పరిధిలోని డీ-82 కాల్వకు ఆదివారం గండి పడింది. భారీ వర్షాల కారణంగా కాల్వ నిండుగా ప్రవహించి, పోతేపల్లి-వెల్దండ ప్రధాన రహదారికి నష్టం వాటిల్లింది. ఈ సంఘటనతో కాల్వలోని కృష్ణా జలాలు వృథాగా పంట పొలాల్లోకి ప్రవహిస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి కాల్వ గండిని పూడ్చి, రహదారి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.