నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారిపై సూర్యతండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా కట్టంగూర్ కు చెందిన వాహన డ్రైవర్ శ్రీకాంత్ గౌడ్ (23) మృతి చెందాడు. బొంగుల బస్తాలను అచ్చంపేటకు తరలిస్తుండగా, వాహనం ఆపి ముఖం కడుక్కుని తిరిగి వస్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.