నాగర్ కర్నూల్: ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభంచిన ఎమ్మెల్యే

631చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీపురం చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ ను బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే కూచికుళ్ళ రాజేష్ రెడ్డి, ఎస్పీ సంగ్రామ్ సింగ్ కలిసి ప్రారంభించారు. పెరుగుతున్న వాహనాల రద్దీని క్రమబద్ధీకరించేందుకు ఈ సిగ్నల్స్ ఎంతో దోహదపడతాయని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సురేందర్, మార్కెట్ చైర్మన్ రమణారావు, డీఎస్పీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.