సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని రేవల్లి గ్రామ శివారులో 167 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన గణేశ్ ద్విచక్ర వాహనంపై మహబూబ్ నగర్ వెళ్తుండగా, రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహన సిబ్బంది ప్రథమ చికిత్స అందించి, కల్వకుర్తి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.