నాగర్ కర్నూల్: మళ్ళీ మొదలైన వర్షం

2చూసినవారు
నాగర్ కర్నూల్: మళ్ళీ మొదలైన వర్షం
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మార్లపాడు తండా గ్రామం మొన్నటి వరకు మొంథా తుపాను కారణంగా జలదిగ్బంధంలో ఉన్నది. సర్వం కోల్పోయిన గ్రామస్తులు అన్ని శాఖల అధికారులు గ్రామంలో ఇప్పుడిప్పుడే తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న సమయంలో సోమవారం ఉదయం గ్రామంలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. మళ్లీ వర్షాలు భారీగా కురిస్తే మళ్లీ ముంపుకు గురి అవుతామా అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.