నాగర్ కర్నూల్: ఇంట్లోకి చొరబడ్డ రక్త పింజర పాము!

929చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం ఒక ఇంట్లోకి మూడు అడుగుల విషపూరిత రక్త పింజర పాము చొరబడటంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ వంశీ వెంటనే అక్కడికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకున్నారు. ఎండల తీవ్రతకు పాములు బయటకు వస్తున్నాయని, వాటిని చంపకుండా తనకు సమాచారం ఇవ్వాలని వంశీ ప్రజలను కోరారు. అనంతరం, పట్టుకున్న రక్త పింజర పామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పామును పట్టుకోవడంతో ఇంటి సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్