నాగర్ కర్నూల్: కమీషన్లకోసం కాంగ్రెస్ కార్యకర్తల మూకుమ్మడిదాడి

1071చూసినవారు
నాగర్ కర్నూల్: కమీషన్లకోసం కాంగ్రెస్ కార్యకర్తల మూకుమ్మడిదాడి
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం బోయాపూర్ గ్రామంలో గత ఏడాది రూ. 10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు కమీషన్ల పంపకాల విషయంలో బుధవారం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. వసూలు చేసిన రూ. 75 వేల కమీషన్ల పంపకాల్లో సయోధ్య కుదరకపోవడంతో వివాదం తలెత్తింది. అధికారులు సమక్షంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి చేరడంతో, ఈ వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరింది. పోలీసులు కేసు నమోదు చేసి, పెద్దల సమక్షంలో మందలించినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్