నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ముమ్మాయిపల్లి గ్రామ శివారులోని కేఎల్ఐ బ్రిడ్జి వద్ద ప్రధాన రహదారిపై గురువారం తెల్లవారుజామున మొసలి కనిపించింది. నాగర్ కర్నూల్ పరిధిలో మొసలి మొదటిసారి కనిపించడంతో ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనతో అప్రమత్తంగా ఉండాలని, అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.