నాగర్ కర్నూల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో, యాసంగి మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.