హైదరాబాద్‌లోని ఇస్మాయిల్ ఖాన్ గూడకు చెందిన 19 ఏళ్ల యువతి, నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటకు చెందిన 26 ఏళ్ల యువకుడిని ఈ నెల 8న వివాహం చేసుకుంది. ఉగాది పండుగ సందర్భంగా పుట్టింటికి వచ్చిన ఆమె, డిగ్రీ పరీక్ష రాయడానికి ఈ నెల 24న ఇంటి నుంచి బయలుదేరి వెళ్లి తిరిగి రాలేదు. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబసభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి ఆచూకీపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.