నాగర్ కర్నూల్: అభివృద్ధి ద్వారానే నక్సలిజం పోతుంది: ఎంపీ

784చూసినవారు
దేశంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ద్వారానే నక్సలిజం అదుపులోకి వస్తుందని నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి అన్నారు. పార్లమెంట్ సమావేశాలలో భాగంగా సోమవారం ఆయన మాట్లాడుతూ, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్, పాఠశాలలు, ఆరోగ్య సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, వేగంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలే నక్సలిజాన్ని నిర్మూలించగలవని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్