కాలేజీలు, స్కూళ్లు పునఃప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా విద్యావ్యవస్థ ఇంకా గాడి తప్పలేదని బీఆర్ఎస్ నేత ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం విమర్శించారు. ప్రభుత్వం విద్యార్థులకు నోట్ బుక్స్, యూనిఫాంలు, బ్యాగులు కూడా సరిగ్గా అందించలేదని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో ఇలాంటి నిర్లక్ష్యం ఎప్పుడూ జరగలేదని, విద్యా సంస్థలు తెరిచినా నిత్యావసర సరుకుల కాంట్రాక్ట్ ఎవరికీ ఇవ్వకపోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు.