నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం వెల్టూర్ లో గురువారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అనూష (35) తన ఇద్దరు పిల్లలకు ఈత నేర్పించేందుకు గ్రామ సమీపంలోని నీటి గుంత వద్దకు తీసుకెళ్లింది. చిన్న కుమార్తె అక్షిత ఈత నేర్చుకుంటుండగా, ఆమె నీటిలో మునిగిపోతుందన్న భయంతో అనూష నీటిలోకి దూకింది. స్థానిక రైతులు బాలికను కాపాడగలిగారు, కానీ ఈత రాని అనూష ప్రాణాలు కోల్పోయింది. ఐదేళ్ల క్రితం ఆమె భర్త మరణించాడు.